హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాజీపేట మార్గంలో అదనపు రైళ్లు వేయాలని విజ్ఞప్తి

WGL: కాజీపేట–వరంగల్–మహబూబాబాద్–ఖమ్మం మార్గంలో అదనపు ప్రత్యేక రైళ్లు నడపాలని భక్తులు కోరుతున్నారు. ఈ మార్గంలో వేలాది మంది అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్నా.. ఒక్క రైలుకే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెయిటింగ్ లిస్టుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు స్పందించి అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.