BHPL: కాటారం మండలంలో పశుపోషణను ప్రోత్సహించేందుకు VB-G RAM-G పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేశ్ తెలిపారు. ఈ పథకం కింద ఆవులు, మేకలు, పందులు, కోళ్ల షెడ్ల నిర్మాణం.. పశుగ్రాసం సాగు, తాగునీటి తొట్టెల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. రైతులు ఆధార్, ఉపాధి హామీ కార్డు, చిన్న రైతు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పశువుల షెడ్ల నిర్మాణానికి ఆర్థిక చేయూత


