హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026లో భారత్-Aతో మ్యాచ్‌‌లో పాకిస్తాన్-A ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగారు. భారత బ్యాటర్లు ఔటైన ప్రతిసారీ అతిగా స్పందిస్తూ, పెవిలియన్‌కు వెళ్తున్న ఆటగాళ్లను కవ్వించారు. ముఖ్యంగా హర్షిత్ రాణా ఔటైన సమయంలో రెచ్చిపోయారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తిలక్ వర్మతోనూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంపైర్ జోక్యం చేసుకున్నారు.