MLG: వేసవిలో వన్యప్రాణులకు నీటి కొరత తలెత్తకుండా ములుగు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అడవుల్లో ఇప్పటికే ఉన్న నీటి వనరులకు అదనంగా ఈ ఏడాది మరో 80 కృత్రిమ నీటి వనరులు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. వేటగాళ్ల కదలికలపై నిఘా కోసం ఐదు వాచ్టవర్లు, కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసింది. సిబ్బందితో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ
వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ చర్యలు


