అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్ ఆటోమేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాదాపు రెండు వేలకుపైగా విమానాలు ఆలస్యం కాగా.. 125కుపైగా విమానాలు రద్దు అయ్యాయి. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాల్లో దాదాపు సగానికిపైగా సర్వీసులపై ప్రభావం పడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా థ్యాంక్స్ గివింగ్ ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది.
వార్తలు
అమెరికాలో మరోసారి సాంకేతిక సమస్య


