హైదరాబాద్: 28°C
వార్తలు

రసాయన కుంకుమ లేకుండా చూడండి: హైకోర్టు

కేరళం ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమలలోని సన్నిధానం, కొట్టాయం జిల్లాలోని ఎరుమేలివద్ద రసాయన కుంకుమ ఆ తరహాలో ఏదైనా కృత్రిమ రంగుల నిల్వ, విక్రయం, వినియోగం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. శబరిమల వద్ద ఈ రసాయన పొడివల్ల కాలుష్యం ఏర్పడుతుందని, అది పంబా నదిలో కలిసి ప్రజారోగ్యానికి ముప్పు కలగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.