హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి తొలి హారతి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.