MHBD: SIR ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు. తొర్రూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని, రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడడం సరికాదని తెలిపారు.
తెలంగాణ
'SIRపై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలి'


