హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు మరో 5 వికెట్లు అవసరం

భారత్, కివీస్ మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఉత్కంఠగా సాగుతోంది. NZ రెండో ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లకు 176/5తో నిలిచింది. డారిల్ మిచెల్(18*), గ్లెన్ ఫిలిప్స్ (0*) క్రీజులో ఉన్నారు. ఉదయం సెషన్‌లో కాన్వే(65), రచిన్ రవీంద్ర(37) వికెట్లను భారత్ పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 720/9కు డిక్లేర్ చేయగా, కివీస్ 368 పరుగులకు ఆలౌటైంది. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 5 వికెట్లు తీయాలి.