హైదరాబాద్: 28°C
వార్తలు

నిర్ణయాలను వ్యతిరేకించండి.. సంస్థలను కాదు: సీజేఐ

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల నిర్ణయాలను విమర్శించే హక్కు దేశ పౌరులకు ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. అయితే ఆ సంస్థలనే లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. ప్రజలు కొన్నిసార్లు ఒక నిర్ణయానికి, దాని వెనుక ఉన్న సంస్థకు మధ్య గల తేడాను గుర్తించడంలో విఫలమవుతున్నారని తెలిపారు. దీని వల్ల.. ప్రజాస్వామ్య మనుగడకు అవసరమైన సంస్థలపై ప్రజావిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు.