శబరిమల వెళ్లే భక్తులకు అక్కడి అధికారులు కీలక సూచన జారీ చేశారు. పంబా, దాని ఉప నదుల్లోని స్నానాల ఘాట్‌లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర చెత్త పారేయడాన్ని నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడికక్కడే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నది కాలుష్యం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వార్తలు
శబరిమల వెళ్లే భక్తులకు కీలక సూచన


