SRD: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మొగుడంపల్లి లక్ష్మి శ్రీలంకలో జరిగిన రెండవ దక్షిణాసియా పారా త్రోబాల్ ఛాంపియన్షిప్-2026లో రజత పతకం సాధించింది. భారత జట్టు తరఫున పాల్గొన్న ఆమె తెలంగాణ నుంచి ఎంపికైన నలుగురు క్రీడాకారుల్లో ఒకరు. లక్ష్మి విజయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలిపారు.
తెలంగాణ
పారా త్రోబాల్‌లో లక్ష్మికి రజతం


