హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడారంలో భక్తుల తాకిడి!

ఉమ్మడి జిల్లా: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ క్షేత్రానికి ఆదివారం వేలాది భక్తులు తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరికాయలు, ఒడిబియ్యం, చీరలు సమర్పించారు. కొందరు మొక్కుగా కోళ్లు, మేకలను బలిచ్చారు.