SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో కార్తీక మాస విశేష పూజలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23న వైకుంఠ చతుర్దశి సందర్భంగా స్వామివార్లకు మహాభిషేకం, అన్నపూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహాపూజ నిర్వహించనున్నారు. 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమేశ్వరాలయంలో జ్వాలాతోరణం నిర్వహించనున్నారు.
తెలంగాణ
రాజన్న ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలకు సర్వం సిద్ధం


