E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి ఆదివారం నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అవ్వను ఆప్యాయంగా పలకరిస్తూ, నగరవాసులతో మమేకమయ్యారు. స్థానిక ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆదరాభిమానాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
నగరవాసులతో ముచ్చటించిన రేలంగి శ్రీదేవి


