AKP: నక్కపల్లి మండలంలోని రేబాక గూడుపమ్మతల్లి ఆలయం ఆదివారం పిక్నిక్ సందడితో కళకళలాడింది. కాకినాడ జిల్లా బొద్దవరం, డి.పోలవరం గ్రామాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పచ్చని వనాల్లో ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. మధ్యాహ్నం వన సమారాధన నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రేబాకలో విద్యార్థులు పిక్నిక్ సందడి


