వరంగల్ జిల్లా కలెక్టరేట్లో రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులు కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్లో ప్రజావాణి: కలెక్టర్


