హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలతో మానసిక ధైర్యం పెరుగుతుంది

NZB: భీమ్గల్‌లో ఆదివారం నిర్వహించిన అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడలతో జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మనోనిబ్బరం అలవడుతుందని అన్నారు. ఆటలతో ఒత్తిడిని జయించి మానసిక పరిపక్వత సాధించవచ్చని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.