ASR: అరకులోయ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నామినేషన్లకు విశేష స్పందన లభిస్తుంది. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 87, వార్డు సభ్యుల స్థానాలకు 221 చొప్పున మొత్తం 308 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు నిర్ణీత సమయంలో దాఖలు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అరకులోయలో 221 నామినేషన్లు


