హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లి డివిజన్‌లో భారీగా నామినేషన్లు

అన్నమయ్య: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో మదనపల్లి డివిజన్‌లో రెండో రోజు 553 సర్పంచ్, 1,053 వార్డు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 782 సర్పంచ్, 1,287 వార్డు నామినేషన్లు నమోదయ్యాయి. సర్పంచ్ నామినేషన్లలో మదనపల్లి 97తో మొదటి స్థానంలో నిలవగా, వార్డు నామినేషన్లలోనూ 302తో ముందంజలో ఉంది. మిగిలిన మండలాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.