హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి విఫలమైంది: సీపీఐ

KKD: ప్రజా వ్యతిరేక విధానాలు, పెరుగుతున్న ధరలు, పన్నుల భారంపై ప్రజలు గళమెత్తాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. కాకినాడ 10వ డివిజన్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.