హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనకనమిట్లలో 85 సర్పంచ్ నామినేషన్లు

ప్రకాశం: కొనకనమిట్ల మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండవ రోజు ఆదివారం 85 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు 259 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు భద్రతా చర్యలను చేపట్టారు.