హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

VSP: జీవీఎంసీలో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జరగనున్న ప్రత్యేక సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం కౌన్సిల్ హాల్లో ఏర్పాట్లు సమీక్షించారు. 120 మంది నూతన కౌన్సిల్ సభ్యులతో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు.