హైదరాబాద్: 28°C
క్రీడలు

మెరిసిన RCB స్టార్‌.. ర‌ఫ్పాడించిన LSG బ్యాటర్‌

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఐపీఎల్ తారలు జితేశ్ శర్మ, అబ్దుల్ సమద్ ఛేజింగ్‌లో మెరవగా, హైదరాబాద్ కెప్టెన్ సీవీ మిలింద్ బౌలింగ్‌లో రాణించి జట్ల విజయాలలో కీలక పాత్ర పోషించారు. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఢిల్లీ, హైదరాబాద్, బరోడా, జమ్మూ కశ్మీర్ జట్లు ఉత్కంఠభరిత విజయాలు సాధించాయి.