హైదరాబాద్: 28°C
క్రీడలు

సిక్స్‌తో శతకం.. అదే నా స్టైల్‌ : రిషబ్‌ పంత్‌

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 128 పరుగులతో రాణించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, తన తొమ్మిదో శతక రహస్యాన్ని వెల్లడించాడు. సరళంగా ఆడటమే తన సూత్రమని, బంతి పరిధిలోకి వస్తే బాదేయడమే తన శైలి అని తెలిపాడు. గతంలో సిక్సర్‌తో శతకం కొట్టే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నానని, ఈసారి ఓపికగా ఎదురుచూసి ఫిలిప్స్‌ బౌలింగ్‌లో సిక్స్ బాది సెంచరీ సాధించానని చెప్పాడు.