హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహన తనిఖీల్లో బయటపడిన మోసం

BDK: వాహనం నంబర్ ప్లేట్ మార్చి తిరుగుతున్న వ్యక్తిపై ములకలపల్లి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం మంగపేట అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీల్లో 1630 నంబర్‌ను 1680గా మార్చిన ద్విచక్రవాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మధు ప్రసాద్ తెలిపారు. నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.