హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వసతి గృహం అప్పగించాలని మెడికోల ఆందోళన

KNR: కొత్తపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల నూతన వసతి గృహం అప్పగింతలో జరుగుతున్న జాప్యంపై మెడికల్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగింది. ఈనెల 20న నూతన హాస్టల్ భవనం పూర్తి కావాల్సింది ఉండగా, ఆ హామీ అమలు కాకపోవడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. హాస్టల్ అందుబాటులోకి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.