హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వరాలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా 12వ రోజు సామూహిక కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళా భక్తులు, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించి దీపారాధనలో పాల్గొన్నారు.