SRD: కోహీర్ మండలం బడంపేటలోని శ్రీ రాచన్న స్వామి ఆలయం ఆదివారం రాత్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక దీపోత్సవం, సామూహిక దీపారాధన, ఆకాశ దీపం ఆవిష్కరణ తదితరకార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
రాచన్న స్వామి ఆలయంలో కార్తీక త్రయోదశి దీపోత్సవం


