హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఇందిరమ్మ సూక్తులు’ పుస్తకం ఆవిష్కరణ

HYD: గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకం ఆవిష్కరణ జరిగినట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు. ఇందిరా గాంధీ ఆశయాలను నేటి యువతకు చేరువ చేయాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని ప్రచురించినట్లు చెప్పారు. సోనియా గాంధీ ముందుమాట రాయగా, డా. పొన్నం రవిచంద్ర, డా. మామిడి హరికృష్ణ, శ్రీలక్ష్మి తెలుగులోకి అనువదించారని వెల్లడించారు.