హైదరాబాద్: 28°C
తెలంగాణ

టైటాన్స్ కప్ విజేతగా కామారెడ్డి జట్టు

SDPT: సిద్దిపేట ఆటోనగర్‌లోని టైటాన్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించిన అండర్-16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టైటాన్స్ కప్‌ను కామారెడ్డి జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఎస్‌వీ క్రికెట్ అకాడమీ సిద్దిపేట జట్టుపై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరు జట్లు పాల్గొన్న టోర్నీలో సాయి హర్షిత్ యాదవ్ ఉత్తమ బ్యాటర్‌గా, షాజన్ ఉత్తమ బౌలర్‌గా ఎంపికయ్యారు.