హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూడూరు మండలంలో పెరిగిన చలి తీవ్రత

VKB: పూడూరు మండలంలో రాత్రివేళ చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం చీకటి పడినప్పటి నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు పలుచోట్ల చలి మంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు చల్లని గాలులతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.