హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15 ఏళ్లుగా భక్తులకు భోజన సదుపాయం: మంత్రి

SS: పెనుకొండలో బాబయ్య స్వామి 754వ ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. గత 15 ఏళ్లుగా ఉరుసు సమయంలో తన పెట్రోల్ బంకు వద్ద భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నదానం నిర్వహించినట్లు వివరించారు.