హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అనంతపురం డిప్యూటీ మేయర్ ఎన్నిక

ATP: అనంతపురం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి రేపు ఎన్నిక జరగనుంది. కౌన్సిల్ హాల్‌లో ఉదయం 11.00 గంటలకు జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి ఆనంద్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి నూతన మేయర్, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు, మున్సిపల్ అధికారులు హాజరవుతారని నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం తెలిపింది.