W.G: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఆకివీడు మండలంలో సర్పంచ్ కు 31 నామినేషన్లు వేశారని ఎంపీడీవో బాబురావు తెలిపారు. వార్డు సభ్యులకు 184 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులో సర్పంచులకు మొత్తం 58, వార్డు సభ్యులకు 267 నామినేషన్లు వేశారు. సోమవారం సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగియనుంది. గడువు పూర్తయ్యాక తుది జాబితా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో రెండో రోజు భారీగా నామినేషన్లు


