హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకానికి 207 దరఖాస్తులు

MDK: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభమైన తొలిరోజే 207 దరఖాస్తులు నమోదైనట్లు కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. పట్టణంలోని 10, 11, 12, 14, 16వ వార్డుల్లో నమోదు ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. అర్హులైన కుటుంబాలన్నీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.