హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలను కలుసుకుని కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముప్పిడి అశోక్ కుమార్‌ను గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.