నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ తన ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు. కార్తీక మాసం, కార్తీక సోమవారం సందర్భంగా కేవలం చూపుడు వేలితో వాటర్ కలర్స్ ఉపయోగించి కార్తీక శోభ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని మూడు గంటల పాటు శ్రమించి రూపొందించినట్లు తెలిపారు. శివుడిపై భక్తితో ఈ చిత్రాన్ని గీశానని కోటేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చూపుడు వేలితో కార్తీక శోభ చిత్రం


