SRCL: కోనరావుపేట మండలం బావు సాయిపేట ఉపసర్పంచ్ తిక్కల నవీన్‌పై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల దేవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సై రామ్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ భర్త ఫిరోజ్ పాషా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఉపసర్పంచ్‌పై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి'


