హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

కడప నగర మేయర్ ప్రమాణ స్వీకారానికి నగరపాలక సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆధునిక హంగులతో కార్యాలయం, మేయర్ ఛాంబర్‌ను ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు మట్లి సువర్ణ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనుండగా, అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు.