హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యత్మ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

NTR: వీరులపాడు మండలంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో, నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు పర్యవేక్షణలో గూడెం మాధవరం, పెద్దాపురం, వెల్లంకి గ్రామాల్లో 80 మంది పోలీసులతో కవాతు చేపట్టారు. మండలంలో 150 మంది సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు.