హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్గీయ చక్రపాణి యాదవ్ సంతాప సభ

KRNL: శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వర్గీయ చక్రపాణి యాదవ్ సంతాప సభ కర్నూలులో నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీతి నిజాయితీ, క్రమశిక్షణ, రాజ్యాంగ విలువలకు కట్టుబడి 50 ఏళ్ల పాటు రాజకీయాల్లో సేవలందించారని కొనియాడారు. కర్నూలులో చక్రపాణి యాదవ్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.