KRNL: గోనెగండ్ల ఎస్సీ కాలనీకి వెళ్లే వాలు వద్ద కొల్లాయి పైపులను రాళ్లతో ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. పైపులు దెబ్బతినడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించి పైపులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గోనెగండ్లలో తాగునీటి పైపుల ధ్వంసం


