హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భవానీ మాత ఆలయంలో వైభవంగా వార్షికోత్సవాలు

SRD: నిజాంపేట మండలం బల్కం చల్కా తండాలోని భవానీ మాత, సంత్ సేవాలాల్ ఆలయ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కుంభాభిషేకం కోసం తండా మహిళలు 1,008 కుండల్లో జలాలను సిద్ధం చేశారు. తండావాసులు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.