హైదరాబాద్: 28°C
తెలంగాణ

73 గ్రామాలకు తాగునీటి భరోసా

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు MLA మదన్ మోహన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 3 మండలాల పరిధిలోని 73 గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.2.78 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.