హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో ఏటిమొగలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

KKD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏటిమొగ ప్రాంతంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జీ.బిందు మాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ దుర్గారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కవాతు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల్లో భద్రతా భావం కల్పించడంతో పాటు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.