హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రసన్నాయపల్లిలో నకిలీ ఆధార్‌లు కలకలం

ATP: పంచాయతీ ఎన్నికల వేళ రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లిలోని చిన్మయ నగర్ కాలనీలో ఉన్న మీసేవ కేంద్రంపై పోలీసులు శనివారం రాత్రి 10:30 గంటలకు దాడి చేశారు. ఈ తనిఖీల్లో నకిలీ ఆధార్ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, ఓటర్ జాబితాలు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓట్ల కోసమే ఇవి తయారుచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు నిర్వాహకుడిని ప్రశ్నిస్తున్నారు.