హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్పిటల్ ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే

SRPT: సూర్యాపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజా హాస్పిటల్‌ను కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, పేదలకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.