హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యామ్నాయ రహదారులపై వడ్లు తొలగించాలి

NZB: నవీపేట రైల్వే గేట్ వద్ద నవంబర్ 22 నుంచి 26 వరకు మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను కమలాపూర్, మోకన్‌పల్లి, జలాల్‌పూర్, మల్కాపూర్ మీదుగా మళ్లించినట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. ప్రత్యామ్నాయ రహదారులపై రైతులు వడ్లు ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.