హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకాంత సీతారామస్వామి ఆలయం ఎక్కడంటే..?

విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలోని సీతారామస్వామి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. వనవాస సమయంలో సీతారాములు ఇక్కడ ఏకాంతంగా గడిపారని ప్రతీతి. అందువల్ల దీనిని శ్రీ ఏకాంత సీతారామస్వామి ఆలయం అంటారు. భద్రాచలం తర్వాత సీతాదేవి రాముని తొడపై కూర్చుని ఉండటం, పక్కన లక్ష్మణుడు లేకపోవడం, రాముని చేతిలో ధనుర్బాణాలు లేకపోవడం ఇక్కడి విశేషం.